వచ్చే వర్షాల నాటికి చుక్కనీరు ఇళ్లల్లోకి రానివ్వకుండా చూస్తా, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడి
చుక్క నీరు ఇళ్లలోకి రానివ్వకుండా చూస్తా: ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం రేణిగుంటలో మునిగిన ప్రాంతాలను సందర్శించారు. భగత్ సింగ్ కాలనీ, అంబేడ్కర్ కాలనీ, బుగ్గ వీధి తదితర లోతట్టు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం సరిగా లేకపోవడంతో ఇళ్లలోకి చేరే పరిస్థితి నెలకొందన్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మిస్తే శాశ్వత పరిష్కారం అవుతుందన్నారు. వచ్చే వర్షాల నాటికి చుక్క నీరు ఇళ్లలోకి రానివ్వకుండా చూస్తానన్నారు.