రామగుండం: లాభాల వాటాలో రేవంత్ రెడ్డి సర్కార్ సింగరేణి కార్మికులను మోసం చేసింది : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
లాభాల వాటా విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కార్మికులను మోసం చేసిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అద్యక్షులు మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు వారు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లాభాల వాటా లో కార్మికులను మోసం చేసిన తీరులో కార్మిక వర్గం నిరసన తెలిపాలని పిలుపునిచ్చారు. అలాగే కార్మికులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో tbgks నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.