మాచర్ల పరిధిలోని ఎత్తిపోతలకు జలకళ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండల పరిధిలోని ఎత్తిపోతల జలపాతం జలకలను సంతరించుకుంది. కొండల మీద నుంచి కిందకు దూకుడు పెడుతున్న జలపాతాలను చూసేందుకు పర్యటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు సాయంత్రం నాలుగు గంటల సమయంలో అధిక సంఖ్యలో వచ్చారు. నాగార్జునసాగర్ డ్యాంకు ఎత్తిపోతల జలపాతం దగ్గరగా ఉండడంతో వాహనాలలో సాగర్ ను చూడటానికి వచ్చిన పర్యటకులు ఎత్తిపోతల జలపాతం చూడ్డానికి వస్తూ ఉంటంతో సందడి వాతావరణం నెలకొంది.