సూర్యాపేట: గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు రోడ్డులోని ఎం బి ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన వ్యక్తి నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. ఇతనికి భార్య ఒక కూతురు ఉన్నారు .అని నిమిత్తం పొనుగోడులోని అత్తగారింటికి వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు.