కుప్పం: కుప్పంలో పరవళ్లు తొక్కుతున్న పాలారు నది
కుప్పం ప్రాంతంలో ప్రవహించే పాలారు నది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటక నందికొండలో పుట్టి కర్ణాటకలో 96 కిలోమీటర్లు, కుప్పం నియోజకవర్గంలో 33 కిలోమీటర్లు ప్రవహించి తమిళనాడులోని ఐదు జిల్లాల్లో 222 కిలోమీటర్ల మేరకు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే పాలారు నది ఇటీవల కురుస్తున్న వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని కనకనాచమ్మ ఆలయం వద్ద పాలారు చెక్ డాం నిండి తమిళనాడుకు నీళ్లు వెళ్తున్నాయి.