సంగారెడ్డి: కందిలో కారు అద్దాలను పగలగొట్టి రూ 1,50,000 నగదును దొంగలించిన గుర్తుతెలియని దొంగలు
సంగారెడ్డి జిల్లా కందిమండల పరిధిలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు దొంగతనం జరిగింది. పటాన్చెరువు మండలం బీరంగూడ చెందిన ఎల్లబోయిన శ్రవణ్ కుమార్ తన ఫోర్డ్ ఫిగో కారులో రూపాయలు 1,50,000 నగదు ఉంచి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. తిరిగి మూడు గంటల 30 నిమిషాల సమయంలో వచ్చి చూసేసరికి గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టి నగదును దొంగలించారని ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇంద్రకరణ్ ఎస్ఐ మీడియాతో తెలిపారు.