ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడు లో పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాల నుండి రక్షణ, డ్రగ్స్ మద్యం దుర్వినియోగంపై ప్రభుత్వ చర్యలు, బాలల హక్కులు మరియు బాల్య వివాహాల నివారణ సంబంధించి ప్రజల్లో చైతన్యపరిచేందుకు పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమం చేపట్టారు