శ్రీకాళహస్తిలో అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం టూరిస్ట్ బస్టాండ్లో కనీస సౌకర్యాలు లేక అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో శ్రీకాళహస్తికి వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు సొంత వాహనాల్లో వస్తుంటారు. పార్కింగ్ ఫీజు వసూలుపై ఉండే శ్రద్ధ సౌకర్యాల్లో కల్పించడంలో కూడా ఉండాలని భక్తులు వాపోతున్నారు. బాత్ రూము, షెడ్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.