ఆర్టీసీ బస్టాండ్ లో పిల్లలకు పాలిచ్చే గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పిల్లలకు పాలిచ్చే గదిని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ కు ఎంతోమంది తల్లులు తమ పిల్లలతో వస్తుంటారని, వారి సౌకర్యార్థం రోటరీ క్లబ్ వారు ఓ గదిని నిర్మించడం అభినందనీయమని అన్నారు. ఇది తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు.