తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షునిగా కొండపి మండలం వేణువుకు చెందిన గొర్రిపాటి రామయ్య చౌదరిని రాష్ట్ర అధిష్టానం ప్రకటించింది. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డిని ఎంపిక చేయగా ఉపాధ్యక్షుడిగా కొండపి నియోజకవర్గానికి ప్రాధాన్య త ఇచ్చారు. రామయ్య చౌదరి గతంలో కొండపి జడ్పీటీసీగా.. కొండపి మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మగా నియోజకవర్గానికి సుపరిచితుడు.