తాడేపల్లిగూడెం: పట్టణంలో సాయంత్రం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర. బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్న జనసేన నాయకులు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంపట్టణంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు పవన్ కళ్యాణ్ వారాహీయాత్ర జరగనుంది.వారాహి విజయభేరి బహిరంగ సభకు జనసైనికులు ముమ్మరం ఏర్పాట్లు చేస్తున్నారు.సభ కారణంగా పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం. కుంచనపల్లి జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో దిగి అక్కడ నుంచి చిన్నతాడేపల్లి మీదగా కారులో సభకు హాజరుకానున్నారు. నియోజకవర్గం నలువైపుల నుంచి భారీ ఎత్తున సభకు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది