వినుకొండ టిడిపి నాయుకులు అసత్య ఆరోపణలు మానుకోండి : వైసిపి లీగల్ సెల్ అధ్యక్షులు గంధం వెంకట హరిప్రసాద్
వినుకొండ పట్టణంలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియా సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు గంధం వెంకట హరిప్రసాద్ మీడియా తో మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం యన్ ప్రసాద్ మీద అసత్యాలు, తప్పుడు ఆరోపణలు వ్యక్తిగత దూషణలు చేసిన న్యాయవాది రామకోటేశ్వరావు మరియు టీడీపీ నాయకులు వారి అసత్య ఆరోపణల పై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టిడిపి నాయకులు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఏది పడితే అది మాట్లాడితే సహించబమన్నారు.