అనంతపురం నగర శివారులో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి, రెండు భాగాలుగా విడిపోయిన శరీరం
Anantapur Urban, Anantapur | Dec 14, 2025
అనంతపురం నగర శివారులోని తాటిచెర్ల గార్లదిన్నె రైల్వే స్టేషన్ల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. అనంతపురం రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు వెల్లడించారు. అనంతపురం నుంచి గుత్తి వైపుకు వెళ్లే అప్ లైన్ లో ఒట్టు తెలియని వ్యక్తి మృతి చెందినట్లుగా గుర్తించామని రైల్వే ఎస్సై వెంకటేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.