కొడంగల్: మైసమ్మ గడ్డ తాండ పరిసర ప్రాంతంలో పిడుగుపాటుకు గురై 15 గొర్రెలు మృతి, కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరో ఐదు గొర్రెలు
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలోని మైసమ్మ గడ్డ తండా పరిసర ప్రాంతంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై అదే తాండాకు చెందిన పీక్లా నాయక్ కు చెందిన 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదు గొర్రెలు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తన వ్యవసాయ పొలంలో మేతమేస్తున్న గొర్రెలు అకాల వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్ళగా అక్కడే పిడుగుపాటుకు గురై గొర్రెలు మృతి చెందినట్లు బాధితుడు వాపోయాడు. సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.