మేడ్చల్: మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జిహెచ్ఎంసి ఈ లక్ష్మణ్ డిఇ లౌక్య వివిధ విభాగ అధికారులు లతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సఫీల్ గూడా చేరువు నుండి సూర్య నగర్ కాలనీ వరకు ఉన్న బాక్స్ డ్రైన్ షెదులావస్థకు చేరుకుంది ఇది 25 ఏళ్ల పురాతనమైనదిగా కాబట్టి ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తక్షణమే సర్వే చేసి కొత్త బాక్స్ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా కోరారు. బండ్ల చెరువు నుంచి వచ్చే ఓవర్ ఫ్లోల వల్ల షిరిడి నగర్ ఎన్ఎండిసి కాలనీ, సమీపంలోని పలు కాలనీలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయని అన్నారు.