వేపులబైలు వద్ద జాతీయ రహదారి పై కారు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పీలేరు మండలం వేపుల బైలు వద్ద జాతీయ రహదారిపై సదుం మండలం ఊటుపల్లి పంచాయతీ మర్రిమాకుల పల్లికి చెందిన ద్వారకనాధ భార్య కె.వనజ 40సం. అనే మహిళ రోడ్డు దాటుతుండగా మదనపల్లి నుండి తిరుపతి వైపు వెళుతున్న ఎపి 40 ఎఎ 0090 కారు ఢీకొనడంతో మహిళ తీవ్రంగా గాయపడింది.హుటాహుటిన క్షతగాత్రురాలిని డ్రైవర్ సెల్వం, ఆమె బంధువులతో కలిసి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు