వై. రామవరం:నరకానికి చిరునామా యార్లగడ్డ నుంచి ఎం.భీమవరం భవాని రోడ్డు: అధికారులు స్పందించాలని వినతి
వై. రామవరం మండలం యార్లగడ్డ - ఎం. భీమవరం రోడ్డు నరకానికి చిరునామాగా మారిందని వాహన చేతకులు వాపోతున్నారు.వర్షాకాలం వచ్చిందంటే ఈ గ్రామాల ప్రజలు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. కొండ సమీపంలో ఉన్న 2కిమీ మేర ప్రయాణం చేయాలంటే భయం వేస్తుందని ఇక్కడ ప్రజలు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. బురద మయంగా మారిన మట్టిరోడ్డులో వాహనాలు జారిపడి ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోయారు. బైక్స్ రిపేరు గురవ్వుతున్నాయని, అధికారులు తగు తీసుకోవాలని కోరుతున్నారు.