యాటపాక: రైతుల ఇబ్బందులను తెలుసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన రంపచోడవరం ఎమ్మెల్యే; పురుషోత్తం పట్నం రైతులు
రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి అన్నదాతల ఇబ్బందులను తెలుసుకుని వాటిని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారని ఎటపాక మండలం పురుషోత్తపట్నం రైతులు వెల్లడించారు. గ్రామంలో ఆదివారం మీడియాతో రైతులు మాట్లాడుతూ.. గత 80 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా.. ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే శిరీషకు ధన్య వాదాలు తెలిపారు.