నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల అహోబిలం వేలం పాటలు, సాక్షి ఎన్టీవీ దినపత్రికల్లో వచ్చిన కథనాలపై ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అహోబిలంలో తమ పార్టీ కి చెందిన వారే సర్పంచ్ గా ఉండి టోల్గేట్ వసూళ్లను తీర్మానం తీసుకొని వచ్చి గతంలో పెంచుకున్నట్లు ఆరోపణలు చేశారని తెలిపారు. ఇప్పుడు మరి మీరు అధికారంలో ఉన్నారు కదా ఆ ధరలను మీరు ఎందుకు తగ్గించడం లేదు అంటూ మాజీ ఎమ్మెల్యే గంగుల సూటిగా ప్రశ్నించారు. గతంలో తమ ప్రభుత్వం కన్నా టెండర్లను తక్కువగ