నగరి: నగరి మండలం నెత్తం కండ్రిగ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ
నగరి మండలం నెత్తం కండ్రిగ ఉన్నత పాఠశాలను ఎంఈఓ నమశ్శివాయ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, టీచర్ల హ్యాండ్బుక్లు, ఎండిఎం రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే చదవడం ఒకటే మార్గమని నొక్కి చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎం ఉమాశంకర్, ఉపాధ్యాయులు నాదముని, కే. బాబు, రామరాజు, వి.ఎల్. బాబు, పద్మజ, సుమతి, శైలజ పాల్గొన్నారు.