ఉప్పల్: చిలకనగర్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం
బుధవారం రోజున భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చిల్కానగర్ శాఖ ప్రాంతీయ కార్యాలయము చిల్కానగర్లోని మల్లికార్జున్ నగర్ కాలనీలో ప్రారంభించారు.భాగ్యనగర్ ఉత్సవ సమితి చిల్కానగర్ శాఖ కన్వీనర్ సంఘీ స్వామి యాదవ్ గారు గణనాధుని పూజతో ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గౌరవ పెద్దలు, పుర ప్రముఖులు కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.