సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం రెండేళ్ల నుంచి ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుంది. ఇంతవరకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.