లారీ దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు లారీ దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు శ్రీకాళహస్తి టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ నెల 7న బసవయ్య పాలెం వద్ద AP03TE9833 గల లారీని డ్రైవర్ పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించి క్లీనర్‌గా పని చేస్తున్న జయచంద్ర లారీని తస్కరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గురువారం కన్నలి ST కాలనీ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.