మంత్రాలయం: కౌతాళంలో ఎన్టీఆర్ కాలనీలో అభివృద్ధి పనులలో పాల్గొన్న టిడిపి నాయకులు
కౌతాళం: మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలనీలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప ధని సొంత నిధులతో, టౌన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో శనివారం రహదారికి గ్రావెల్ వేసి మరమ్మతుల పనులు చేపట్టారు. కాలనీలో మూకన్న ఇంటి నుంచి జేకేఎల్ఎస్ స్కూల్ వరకు రహదారికి ఇరువైపులా జేసీపీ ద్వారా డ్రైనేజీ తీయించి రహదారికి గ్రావెల్ వేయించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.