గన్నేరువరం: గుండ్లపల్లి నుండి పోత్తూరు డబుల్ రోడ్డుకు తట్టేడు మట్టి పోసిన చరిత్ర రసమయికి లేదన్న కాంగ్రెస్ నాయకులు...
డబుల్ రోడ్డు సమస్యపై మాజీ ఎమ్మెల్యే రసమయి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని... కాంగ్రెస్ నాయకులు అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి ఆద్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం మద్య్హనం మీడియాతో మాట్లాడారు. గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అడిగే అర్హత రసమయికి లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్డు కావాలని ఉద్యమిస్తే... కాంగ్రెస్ నాయకులపై, యువకులపై అక్రమ కేసులు పెట్టి వారి భవిష్యత్తును నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ఆలస్యమవడానికి రసమయి హయాంలో బకాయి పడిన కాంట్రాక్టర్ బిల్