పీలేరు సబ్ జైలును సందర్శించిన చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక
అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలును చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక శనివారం పీలేరు సబ్ జైలును సందర్శించారు. సబ్ జైలులోని ఖైదీలతో జైలులో గల సౌకర్యాలను వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సౌకర్యాపై ఆరా తీశారు.సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.ఆర్థిక స్తోమత లేని ఖైదీలను ప్రభుత్వం ద్వారా ఉచితంగా న్యాయవాదిని అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా జడ్జి ఏ.మహేష్,చిత్తూరు జిల్లా సెక్రెటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎమ్మెస్ భారతి, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి షేక్ జియావుద్దీన్, సబ్ జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు