మచిలీపట్నంలో ప్రజలకు అవకాశాలు పెంపొందించడానికి చర్యలు
Machilipatnam South, Krishna | Sep 23, 2025
కృష్ణా జిల్లాలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సహకారంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడం, కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, సంప్రదాయ జీవనోపాధి మార్గాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించాలని ఆయన సూచించారు.