కలువాయిలో వర్షానికి దెబ్బతిన్న వరి పంటను పరిశీలించిన ఆచార్య ఎన్జీరంగా విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు..
Gudur, Tirupati | Oct 25, 2025 పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల కోతకు వచ్చిన వరి నేల పడిపోవడం, వెంటనే మొలకల రావడం వల్ల రైతులకు నష్టం వాటిల్లిందని కృషి విజ్ఞాన పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త యు వినీత అన్నారు. నెల్లూరు జిల్లా, కలువాయి మండలంలో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా తడిచి, నీటిలో మునిగిన వరి పొలాలను శనివారం నెల్లూరు ఆచార్య ఎన్జీరంగా, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు పరిశీలించారు