హైదరాబాద్ జిల్లా: గంగారం ఇన్ఫినిటీ మాల్ నుంచి అల్విన్ జంక్షన్ వరకు భారీగా వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య శనివారం రాత్రి తలెత్తింది. ఈ సందర్భంగా ఒక పక్క వర్షం మరోవైపు రెయిన్ వాటర్ నాలా పనుల వల్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉండి ట్రాఫిక్ లో నియంత్రిస్తున్నారు. వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి అధికారులు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలన్నారు.