బుక్కపట్నంలో డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్న సిపిఎం నేతలు
శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం డ్వాక్రా గ్రూపునకు సంబంధించి ఎనిమిది లక్షల రూపాయలు స్వాహా చేసిన ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని మంగళవారం మధ్యాహ్నం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపునకు సంబంధించి ఓ మహిళ ఎనిమిది లక్షల రూపాయలు స్వాహా చేసి ఇల్లు నిర్మించుకుందని, ఇతర గ్రూపు సభ్యులు ప్రశ్నిస్తే ఆ ఇంటిని అమ్మి డబ్బు గ్రూప్ ఖాతాలో జమ చేస్తానని చెప్పిన క్రమంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఇతర మహిళలపై దాడికి పాల్పడ్డారన్నారు. ఇందులో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.