యర్రగొండపాలెం: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు బాధితులకు అందజేశారు. వివిధ రకాల అనారోగ్యాలతో ఇబ్బందులకు గురేవుతున్న 33 మంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 32.58 లక్షలు మంజూరయ్యాయి. వాటిని ఎరిక్షన్ బాబు అందజేశారు. ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ని మర్చిపోకూడదన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.