నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లెలోని కనకదుర్గమ్మ గుడిలో గంటను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గురువారం యథావిధిగా పూజలు చేయడానికి పూజారి సుబ్బరాయుడు వెళ్లి చూడగా గుడి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. గుడి తాళాలను పగలగొట్టి గుడిలో ఉన్న రూ.15 వేలు విలువ చేసే గంటను ఎత్తుకెళ్లినట్లు పూజారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.