తడ పోలీసులపై ఆరోపణలు నిరాధారం
- సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ
తిరుపతి జిల్లా తడ మండలం పూడి గ్రామానికి చెందిన ఓబులాపురం పరమశివంరెడ్డి పై తప్పుడు కేసులు వేస్తున్నారనే ఆరోపణలు అసత్యమని సూళ్లూరుపేట సీఐ మురళీ కృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2010 నుంచి ఇప్పటివరకు పరమశివం రెడ్డిపై తడ పోలీస్ స్టేషన్లో ఏడుకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో కొట్లాట, ఫోర్జరీ, అధికారులను బెదిరించడం, స్థలాలను కబ్జా చేయడం వంటి నేరాలు ఉన్నాయని పేర్కొన్నారు. చట్టపరంగా దర్యాప్తు జరిపి, సాక్ష్యాధారాలతో కోర్టుకు చార్జీషీట్లు సమర్పించామని సీఐ మురళీకృష్ణ తెలిపారు.