కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం ప్రజా వేదికలో 22 మంది బాధితులకు రూ.10.32 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు 22 మంది బాధితులకు రూ.10.32 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. అనారోగ్యం, వివిధ కారణాలతో ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేయిస్తామన్నారు.