అసిఫాబాద్: మోతుగూడ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టిన మృతుల కుటుంబ సభ్యులు
ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామ సమీపంలో ఆదివారం కారు బైక్ ఢీ కొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. కారు డ్రైవర్ ను పట్టుకొని కఠినంగా శిక్షించాలని మృతుల కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో ఆసిఫాబాద్,మంచిర్యాల వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.