అసిఫాబాద్: బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్,బీజేపీల కుట్రలు: బీఎస్పీ
బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్,బీజేపీ,BRS లు వ్యతిరేకం అని,43 ఏండ్లపాటు దేశంలో బీసీలకు రిజర్వేషన్ లు అమలు కాకుండా కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నారని బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ లుంబినీ దీక్షభూమిలో ఏర్పాట్లు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. అంబేద్కర్ పోరాటంతోనే బహుజనులకు రాజ్యాంగం ద్వారా హక్కులు లభించాయని అన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన చేసి 56% బీసీల జనాభా అని చెప్పి 42% రిజర్వేషన్ లు ప్రకటించిన ముఖ్యమంత్రికి బీసీ రిజర్వేషన్ ల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ లు కల్పించాలని డిమాండ్ చేశారు