నెహ్రు నగర్ గ్రామ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం : కార్యాలయానికి తాళం వేయకుండా వెళ్లిపోయిన సిబ్బంది
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రు నగర్ గ్రామంలో ఒకటవ సచివాలయ కార్యాలయానికి సిబ్బంది సోమవారం తాళం వేయకుండా వెళ్ళిపోయారు, సోమవారం రాత్రి చీకటి వేళ సైతం కార్యాలయం తెరిచి ఉండటాన్ని గ్రామస్తులు సోమవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు గుర్తించారు, పంచాయతీ కార్యదర్శి కి ఫోన్ చేసి తెలపగా, పంచాయతీ కార్యదర్శి నెహ్రు నగర్ గ్రామ వీఆర్ఏకు ఫోన్ చేయడంతో రాత్రి వెళ్లి సచివాలయానికి తాళం వేశారు, సిబ్బంది నిర్లక్ష్యం పై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.