మద్దయ్య గారి పల్లెలో గడపగడపకు పర్యటించిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం. మద్దయ్య గారి పల్లె పంచాయతీ గ్రామాలలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గడపగడపకు పర్యటించి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకుని కొన్ని వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి. గురువారం ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.