మంచిర్యాల: మందమర్రి టోల్గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీ కొట్టిన లారీ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో బుధవారం సాయింత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ సమీపంలో లారీ అదుపుతప్పి ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జయింది. లారీ డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, సురక్షితంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.