దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలు అరెస్ట్, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ, రొద్దం మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇల్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. పెనుకొండలో ఎస్పి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దొంగల వద్ద నుంచి రూ.15,30,000 విలువ చేసే చోరీ సొత్తును రికవరీ చేసినట్టు తెలిపారు.