హిమాయత్ నగర్: రాంనగర్ వరదలకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపిస్తాం: హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్
ముషీరాబాద్ లోని వినోబా నగర్ కాలనీలో నాలాలో పడ్డ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన స్థలాన్ని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నాళాలు ఆక్రమించడం వల్లే వరదలు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వరదల వల్ల పేద ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారని వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడతామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు.