నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, అనంతరం VHP అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో పుల్లారెడ్డి సేవాసమితి కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు నిరసన ర్యాలీ సాగింది, ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ హిందువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో టిఎంసి వేణుగోపాల్ తో పాటు పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు