మంచిర్యాల: ఐక్య పోరాటాల సన్నాహక తేదీలు తెలపాలి: సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి
ఈనెల 11, 12వ తేదీలలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన సొంతింటి కల కొరకై నిర్వహించిన పోలింగ్ బ్యాలెట్ ను లెక్కించడానికి ఆదివారం మధ్యాహ్నం మందమర్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హాజరు అయ్యి ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక కార్మికునికి పేరుపేరునా విప్లవ అభివందనాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు కావాలని పట్టుబట్టి కోర్టుకు వెళ్లి ఎన్నికలు పెట్టించిన AITUC స్ట్రక్చర్ సమావేశాల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నేడు ఒక పూట జరగకముందే సమావేశం బహిష్కరించి వేలాది మంది కార్మికుల ఆశలపై నీళ్లు చల్లారని తెలిపారు.