సర్వేపల్లి: పెన్నా నదిలో చిక్కుకున్న 17 మంది పేకాట రాయులు, కాపాడాలంటూ ఆర్తనాదాలు
భగత్ సింగ్ కాలనీ సమీపంలోని పెన్నా నదిలో 17 మంది యువకులు చిక్కుకున్నారు. పేకాట ఆడేందుకు పెన్నా నదిలోకి 17 మంది వెళ్లారు. సోమశిల రిజర్వాయర్లో నీరు విడుదల చేయడంతో ఒకసారిగా పెన్నా నదికి నీటి ఉధృతి పెరిగింది. ఈ క్రమంలో రెండు వైపులా నీరు రావడంతో వీరు నీటిలో చిక్కుకున్నారు. ఆర్తనాదాలు చేయడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో వార్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.