పత్తికొండ: వెల్దుర్తి మండలానికి చెందిన రైతు భూమి సమస్యపై acb అధికారులు దాడులు
డోన్ పట్టణంలో మంగళవారం లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఘటనపై వెల్దుర్తి మండలం గుంటుపల్లికి చెందిన రైతు వేణుగోపాల్ చౌదరి మాట్లాడుతూ.. తాను కొన్నేళ్లుగా భూసమస్యతో ఇబ్బందులు పడుతున్నానని అన్నారు. పూర్వీకుల భూమి పత్రాలు సక్రమంగా ఉన్నా, వాటిని ప్రభుత్వ రికార్డుల్లో సరిదిద్దేందుకు ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.