ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా జరిగే ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వాల్మీకిపురం పట్టణ మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పీలేరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పీలేరు నియోజకవర్గ వైకాపా నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈనెల 15వ తేదీన రాయచోటి నందు వైకాపా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా జరిగే ర్యాలీ కార్యక్రమం నందు పీలేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనాలని తెలిపారు