మంచిర్యాల: మంచిర్యాలలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం
మంచిర్యాల పట్టణంలో గోదావరి పుష్కరాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎమ్మార్వో రపతుల్లా హుస్సేన్, ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్ రావు గోదావరి ఒడ్డున పర్యటించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి గోదావరి నది తీరం వరకు రూట్ మ్యాప్ను పరిశీలించారు. అనంతరం పుష్కర ఘాట్లను సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.