పుట్టపర్తిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలోని చిత్రావతి పరీవాహక ప్రాంతంలో అభివృద్ధి పనులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం సాయంత్రం పరిశీలించారు. నది సమీపంలో రూ.1.20 లక్షలతో నిర్మిస్తున్న చిల్డ్రన్ పార్కును ఆయన పరిశీలించారు. సత్యసాయి శతజయంతి సమీపిస్తున్న సమయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు ఆయన సూచించారు.