నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సులను ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
Eluru Urban, Eluru | Jun 13, 2025
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భీమవరం నుండి భద్రాచలం కు కొత్త సర్వీసు ఏలూరు డిపో నందు ప్రారంభోత్సవం జరిగింది.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం నాలుగు తొలుత ఆయనకు ఏలూరు కొత్త బస్టాండ్ లో బస్సు సర్వీస్ ను రిబ్బన్ కట్ చేసిరెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కొత్త బస్సులు కొత్త రూట్ల నందు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.