సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో రేపు బంద్ మీడియాతో వివరాలు తెలిపిన జిల్లా జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ శనివారం బంద్ కు బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభు గౌడ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బందుకు సహకరించాలని పోలీసులు, ఆర్టీసీ, విద్యార్థి సంస్థల యజమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ బంద్ ద్వారా బీసీల సత్తా ప్రభుత్వానికి తెలియాలని ఆయన పేర్కొన్నారు.